sabbitham water falls

sabbitham water falls near peddapalli also known as gourigundala waterfalls.

Ramagundam NTPC

NTPC Ramagundam, a part of National Thermal Power Corporation, is a 2600 MW Power station situated at Ramagundam in Peddapalli district

SINGARENI COLLERIES COMAPNY LIMITED

The Singareni Collieries Company Limited or SCCL sccl is currently operating 16 opencast and 32 underground mines in districts peddapalli,mancherial,komurambheem,bhadradri,jayashankar,khammam

yellampally project

Sripada Yellampalli project is an irrigation project on river godavari located at Yellampalli Village,peddapalli district.

peddapalli railway junction

Peddapalli Junction is a railway station is located on new delhi-chennai main line

Tuesday, 25 October 2016

Saturday, 22 October 2016

ఆటోవాలాలు బాధ్యతాయుతంగా మెలగాలి

-రామగుండం పోలీస్ కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్
ఆటో డ్రైవర్లు ప్రయాణికుల విషయంలో మర్యాదగా, బాధ్యతాయుతంగా మెలగాలని రామగుండం నగర పోలీస్ కమిషనర్ విక్రం జిత్ దుగ్గల్ సూచించారు. మీ కోసం జనమైత్రి పోలీసు కార్యక్రమంలో భాగంగా శనివారం నగరంలోని ఆర్‌సీఓఏ క్లబ్‌లో ఆటో డ్రైవర్లు, యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుగ్గల్ ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. ఆటో డ్రైవర్లు, యజమానులు బాధ్యతా యుతంగా మెలిగితే ఎలాంటి పోలీసుల వేధింపులుండవన్నారు. ఆటోవాలాలు లైసెన్సు, జీవిత బీమా, రిజిస్ట్రేషన్, అన్ని ధ్రువీకరణ ప్రతాలు కలిగి ఉంటే వారితోపాటు ఆటోలలో ప్రయాణించే ప్రయాణికులకు సైతం మంచిదన్నారు.

ఆటో డ్రైవర్లు ఇప్పటి నుంచి గుర్తింపు కార్డు, డ్రైవర్ సీట్ వెనుక ఆటో డ్రైవర్ యజమాని పేరు, చిరునామా, మోబైల్ నంబరు విధిగా ఏర్పాటు చేసుకోవాలనీ, ఆటో వివరాలను ఆధార్ కార్డు కలిపి ట్రాఫిక్ ఠాణాలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలనీ, అన్ని కాగితాలున్న వాహనాలకు రెడ్ స్టిక్కర్లు అంటిస్తామని ఇలాంటి వాటిని మాటిమాటికి ఆపమన్నారు. ఆటోలో అసాంఘీక కార్యకలాపాలు, గుట్కా, రేషన్ బియ్యం, ఇతరత్రా అక్రమాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

అనంతరం నగర పాలక సంస్థ పరిధిలోని ఆటో డ్రైవర్లకు, యజమానులకు ఆర్‌ఎస్ సొల్యుషన్స్ సంస్థ ద్వారా రూ.100 చెల్లిస్తే ప్రమాద బీమా రూ. 2 లక్షలు ఇప్పించేలా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామగుండం ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్దపల్లి జోన్ డీసీపీ విజయేందర్ రెడ్డి, ఏసీపీ మల్లారెడ్డి, ఆటో యూనియన్ గౌరవాధ్యక్షుడు గోపు ఐలయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐలు లక్ష్మయ్య, రాంమ్మూర్తి, మస్తాన్, 1100 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు


ఆకాంక్షకు అనుగుణంగానే వారసత్వ ఉద్యోగాలు

బొగ్గు గని కార్మికుల ఆకాంక్షకు అనుగుణంగా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయించ డం జరిగిందనీ, ఆ మేరకు అధికారులకు సూచించినట్లు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు పేర్కొన్నారు. యూనియన్ కార్యాలయంలో శనివారం ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య కేంద్ర ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి విలేకరులతో సమావేశమై, ఆయన మాట్లాడారు.

ఈ నెల 6న సంఘ గౌరవ అధ్యక్షురాలు ఎంపీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ముఖ్యమంత్రిని కలిసి కార్మికుల ఆకాంక్షను ఆయన దృష్టికి తీసుకెళ్లామనీ, వెంటనే ఆయన స్పందించి దసరా కానుకగా ఎలాంటి షరతులు లేకుండా అందరికీ వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే వారసత్వ ఉద్యోగాలపై 20న ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ నుంచి సింగరేణి కార్యాలయానికి లేఖ వచ్చినట్లు చెప్పారు. దీనిపై త్వరలోనే జరుగనున్న బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారనీ, మెజార్టీ సభ్యుల అనుమతి లభించిన పదిరోజుల్లో వారసత్వ ఉద్యోగాల అమలుపై సింగరేణి స్పష్టమైన నిర్ణయం ప్రకటించనున్నదని పేర్కొన్నారు.

ఇది జీర్ణించుకోలేని జాతీయ సంఘాలు వారసత్వంపై చేస్తున్న విషప్రచారాన్ని కార్మికులు నమ్మొద్దని పిలుపునిచ్చారు. గతంలో వారసత్వ ఉద్యోగాల కాలపరిమితి ఒక సంవత్సరం వుంటే దాన్ని రెండేళ్లకు పెట్టి అమ్ముకున్న ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్ సంఘాలు ఇప్పుడు రాద్దాంతం చేయడం సిగ్గు చేటన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సింగరేణి కార్మికులకు సొంతింటి కల నేరవేర్చుతామని హామీ ఇచ్చారు. ఇందులో ఐలి శ్రీనివాస్, కొత్తసత్యనారాయణరెడ్డి, శంకర్‌నాయక్, నాగెల్లి సాంబయ్య, కె.రవీందర్, శ్రీనివాస్‌రెడ్డి, సుంకరి విజయ్, కాంతాల కిషన్‌రెడ్డి, పర్రెరాజనరేందర్, ఇసంపెల్లి రమేష్, ఇటికాల బాలయ్య, పెంచాలతిరుపతి, నాయిని మల్లేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చారిత్రక ఖిల్లా..రామగిరి ఖిల్లా

ఆంధ్రుల అతి ప్రాచీన దుర్గాల్లో ఒకటైన ధూళికట్ట(ధూళికోట) ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో ఉంది. కోటకు సమీపంలోని బౌద్ధస్తూపం క్రీ.పూ.4వ శతాబ్దానికి చెందినదికాగా, అమరావతి స్తూపం(క్రీ.శ.1వ శతాబ్దం) కంటే అతి ప్రాచీనమైంది. ధూళికట్టలోని తొలి చారిత్రక యుగపు దిబ్బ 18 హెక్టార్ల స్థలంలో విస్తరించి ఉండగా, పురావస్తు తవ్వకాల్లో రాజభవనాలు, ధాన్యాగారాలు, ఇతర నిర్మాణాలు, బావులు, అనేక పంచ్‌మార్క్‌డ్ నాణేలు, బాణపు మొనలు, బల్లెపు మొనలు, మృణ్మయ పాత్రలు, రాగి, ఇనుప, దంతపు, టెర్రకొట్ట వస్తువులు, పూసలు బయటపడ్డాయి. హుస్సేనిమియా వాగు తీరంలోని హీనాయాన శాఖకు చెందిన బౌద్ధస్తూపం దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీనమైంది.

చరిత్ర చెక్కిన రామగిరి..
కమాన్‌పూర్ మండలంలోని బేగంపేట, రత్నాపూర్, కల్వచర్ల గ్రామాల నడుమ విస్తరించిన రామగిరి ఖిల్లా సుప్రసిద్ధ గిరిదుర్గం. శత్రుదుర్భేద్యమైన ఈ కోట, అరుదైన శిల్పకళ, ప్రకృతి సోయగాలకు నెలవు.

విశేష వనమూలికలు, అపార వృక్ష సంపదకు నిలయం. మతసామరస్యానికి ప్రతీకగా ఉన్న రామగిరి ఖిల్లా, పటిష్ఠమైన రాతి కట్టడం. కో టగోడలు, బురుజులు, భవనాలు, సమాధులు, మసీదులు, బావులు, కొలనులతో నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. దుర్గాంతర్భాగంలో కాకతీయ ప్రతాపరుద్రుడి ఆధ్వర్యంలో నిర్మించిన కోట, అశ్వశాల, దర్బారు, చెరసాల, గజశాల, భోజనశాలలు, రహస్యమార్గాలు, సొరంగాలు, తోపులు, ఫిరంగులు, ఫిరంగి గుండ్లు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి.

శాతవాహనుల తొలిరాజధాని కోటిలింగాల, మరో నగరం ధూళికట్ట(ఈ రెండూ కరీంనగర్ జిల్లాలోని శాతవాహనుల స్థావరాలు)కు అత్యంత సమీపంలో ఉండడం వల్ల క్రీ.పూ.2వ శతాబ్దం నాటికే రామగిరి, శాతవాహనుల రహస్య స్థావరంగా ఉండి ఉంటుందని తెలంగాణ చరిత్రకారులు భావిస్తున్నారు. అప్పటి నుంచి వివిధ రాజవంశాలకు చెందిన రాజులు ఎవరికి తోచిన రీతిలో వారు కొండపై నిర్మాణాలు చేపడుతూ వచ్చారు.

కళ్యాణి చాళుక్యుల కాలంలో (క్రీ.శ.973- క్రీ.శ.1189) ఓరుగల్లు కాకతీయ రెండో ప్రోలరాజు.. క్రీ.శ.1138లో మంథని గుండరాజు, రామగుండం ఏడ రాజుపై దండెత్తగా, వారిద్దరూ రామగిరి దుర్గాన్ని రక్షణగా చే సుకుని యుద్ధం చేశారు. వీరిద్దరూ పరాజయంపాలవడంతో రామగిరి కాకతీయుల వశమైంది. అనంతర కాలంలో రేచర్ల పద్మనాయక రాజు అనపోతనాయకుడు దీనిని ఆక్రమించి, ముప్పభూపాలుడు అనే సామంతుడిని తన ప్రతినిధిగా నిలిపాడు.

ఇతడు రామగిరి కేంద్రంగా రాజ్యపరిపాలన చేశాడు. క్రీ.శ. 1433లో బహమనీ సుల్తాన్ మొదటి అహ్మద్‌షా తెలంగాణపై దండెత్తడంతో రామగిరి దుర్గం అతని వశమైంది. కుతుబ్‌షాహీ వంశస్థాపకుడైన కులీకుతుబుల్ ముల్క్(1518-1543), బహమనీల ప్రతినిధి ఖివాము ల్ ముల్క్‌ను ఓడించి, రామగిరిని వశపరుచుకున్నాడు. క్రీ.శ.1656లో గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా ఔరంగజే బు రాజప్రతినిధి చేతిలో ఓడిపోయి, తన కుమార్తెను ఔరంగజేబు కొడుకుకు ఇచ్చి, కట్నం కింద రామగిరి కోటను అప్పగించాడు.

ఎన్నెన్నో విశేషాలు..
ఓదెల మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి దేవాలయం, సుల్తానాబాద్, పెద్దపల్లి మండలాల నడుమ నిమ్మనపల్లి లక్ష్మీ నంబులాద్రి స్వామి దేవాలయం, ధర్మారం మండలం బొట్లవనపర్తిలోని లక్ష్మీ నృసింహస్వామి ఆలయం, వేదపురిగా గుర్తింపు పొందిన మంథనిలోని గౌతమేశ్వరాలయం సహా అనేక ప్రాచీన దేవాలయాలు, పెద్దబొంకూర్‌లోని శాతవాహనుల గ్రామం, కదంబాపూర్‌లోని బృహత్‌శిలా సమాధులు జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక రామగుండంలోని రామునిగుండాలు, బ సంత్‌నగర్ సమీపంలో బుగ్గ, పెద్దపల్లి మండలం సబ్బితంలోని గౌరి గుండాలు పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి.

Wednesday, 19 October 2016

తెలంగాణ 31 జిల్లాల సంక్షిప్త సమాచారం

అభివృద్ధిపథంలో శరవేగంగా ముందుకెళుతున్న తెలంగాణ రాష్ట్రం పరిపాలన వికేంద్రీకరణలో అత్యంత కీలక ముందగడుగు వేసింది. రాష్ట్రంలోని పది జిల్లాలను ప్రభుత్వం 31 జిల్లాలుగా విభజించింది. ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం మరింత చేరువయ్యేందుకు, తద్వారా పాలనలో మరింత పారదర్శకతకు ఈ పరిణామం భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగ పడుతుంది.
ప్రజలకు చేరువగా పాలన, సమర్థంగా పథకాల అమలు, పేదరిక నిర్మూలన, పటిష్ఠ పర్యవేక్షణ లక్ష్యాలతో ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు పూనుకుంది. తెలంగాణలో చివరిసారిగా 38 ఏండ్ల క్రితం అంటే 1978 ఆగస్టు 15న రంగారెడ్డి జిల్లా ఆవిర్భవించింది. ఆ తర్వాత అనేక కొత్త జిల్లాల కోసం డిమాండ్లు వచ్చినా సాధ్యపడలేదు. ప్రస్తుతం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం-1974 ప్రకారం తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. కొత్తగా 21 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 31కి, రెవెన్యూ డివిజన్లు 68కి, మండలాలు 584కి పెరిగాయి. రాజ్యసభ సభ్యుడు కే కేశరావు నేతృత్వంలో ఏర్పాటైన హై పవర్ కమిటీ ముసాయిదా నోటిఫికేషన్‌లో ఇచ్చినవి కాకుండా అదనంగా సిరిసిల్ల, జనగామ, గద్వాల్, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సిఫారసు చేసింది. ఈ కమిటీలో మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, పోచారాం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న సభ్యులుగా ఉన్నారు.

తెలంగాణ జిల్లాల విశేషాలు

-రాష్ట్రంలో సగటున జిల్లాల విస్తీర్ణం 3,704 చ.కి.మీ.
-జనాభాపరంగా దేశంలో తెలంగాణ రాష్ర్టానికి 12వ స్థానం, వైశాల్యంలో కూడా 12వ స్థానం. జిల్లాల సంఖ్యపరంగా 9వ స్థానంలో ఉంది.
-రాష్ట్రంలో 5 నుంచి 10 లక్షల జనాభాగల జిల్లాలు 19 ఉన్నాయి. పది నుంచి పదిహేను లక్షల జనాభాగల జిల్లాలు 6, పదిహేను నుంచి ఇరవై లక్షల జనాభాగల జిల్లాలు 3, ఇరవై లక్షల జనాభా పైబడిన జిల్లాలు 3 ఉన్నాయి.
-రాష్ట్రంలో 6 మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. అవి.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్.
-రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 20 జిల్లాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక సరిహద్దులతో ఉన్నాయి.
-కర్ణాటక సరిహద్దుగల జిల్లాలు 6. అవి.. మహబూబ్‌నగర్, వికారాబాద్, గద్వాల, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి.
-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగల జిల్లాలు 6. అవి.. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, గద్వాల, కొత్తగూడెం.
-మహారాష్ట్రతో సరిహద్దుగల జిల్లాలు 5. అవి.. భూపాలపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, కామారెడ్డి.
-ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దుగల జిల్లాలు 3. అవి.. భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల.
-అత్యధిక జిల్లాలు వరంగల్ నుంచి ఏర్పడ్డాయి.
-విభజనకు గురికాని జిల్లా హైదరాబాద్.

కొత్తవి


-జిల్లాలు - 21
-రెవెన్యూ డివిజన్లు - 25
-మండలాలు - 125
-పోలీస్ కమిషనరేట్‌లు - 4
-పోలీస్ డివిజన్లు - 23
-పోలీస్ స్టేషన్లు - 91
-సర్కిళ్లు - 28


మొత్తం జిల్లాలు: 31
విస్తీర్ణం: 1,12,077 చ.కి.మీ.
జనాభా: 3,50,03,674
అక్షరాస్యత: 66.46

మండలాల సంఖ్య: 584
రెవెన్యూ డివిజన్లు: 68
రెవెన్యూ గ్రామాలు: 10,966

జిల్లాలు-ప్రాముఖ్యత
అతిపెద్ద జిల్లా: భద్రాద్రి-కొత్తగూడెం (8,062 చ.కి.మీ.)
అతిచిన్న జిల్లా: హైదరాబాద్ (217 చ.కి.మీ.)
ఎక్కువ మండలాలు ఉన్న జిల్లా: నల్లగొండ (31)
తక్కువ మండలాలున్న జిల్లా: వరంగల్ అర్బన్ (11)
రెవెన్యూ డివిజన్లు ఎక్కువ ఉన్న జిల్లా: రంగారెడ్డి (11)
తక్కువ రెవెన్యూ డివిజన్లు ఉన్న జిల్లాలు: రాజన్న సిరిసిల్ల, వనపర్తి, జోగులాంబ గద్వాల, వరంగల్ అర్బన్
అత్యధిక గ్రామాలున్న జిల్లా: సంగారెడ్డి (600)
అతితక్కువ గ్రామాలున్న జిల్లా: హైదరాబాద్ (100)
అత్యధిక జనాభాగల జిల్లా: హైదరాబాద్ (39,43,323)
తక్కువ జనాభా ఉన్న జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా (5,43,694)
అత్యధిక జనాభాగల మండలం: బహదూర్‌పుర (4,68,158)
- హైదరాబాద్
అత్యధిక జనాభాగల రెండో మండలం: ఖమ్మం అర్బన్
తక్కువ జనాభా ఉన్న మండలం: గంగారం (10,780)
- మహబూబాబాద్ జిల్లా
ఎక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లా: హైదరాబాద్ (83 శాతం)
తక్కువ అక్షరాస్యత కలిగి ఉన్న జిల్లా: కామారెడ్డి (48.49 శాతం)


ఆదిలాబాదు


Adilabad_District విస్తీర్ణం: 4,153 చ.కి.మీ.
జనాభా: 7,21,433
అక్షరాస్యత: 63.01 శాతం
మండలాలు: 18
అత్యధిక జనాభాగల మండలం: ఆదిలాబాదు అర్బన్ మండలం
అత్యల్ప జనాభాగల మండలం: గడిగూడ
రెవెన్యూ డివిజన్లు: ఆదిలాబాదు, ఉట్నూరు
రెవెన్యూ గ్రామాలు: 504

నల్లగొండ


NALGONDA_District విస్తీర్ణం: 6,863 చ.కి.మీ.
జనాభా: 16,31,399
అక్షరాస్యత: 65 శాతం
మండలాలు: 31
అత్యధిక జనాభాగల మండలం: నల్లగొండ
అత్యల్ప జనాభాగల మండలం: నేరేడుగొమ్ము
రెవెన్యూ డివిజన్లు: నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ
రెవెన్యూ గ్రామాలు: 565

నిర్మల్


NIRMAL_District విస్తీర్ణం: 3,845 చ.కి.మీ.
జనాభా: 7,30,286
అక్షరాస్యత: 57.73 శాతం
మండలాలు: 19
అత్యధిక జనాభాగల మండలం: భైంసా
అత్యల్ప జనాభాగల మండలం: నర్సాపురం జి
రెవెన్యూ డివిజన్లు: నిర్మల్, భైంసా
రెవెన్యూ గ్రామాలు: 428

సూర్యాపేట


SURYAPET_District విస్తీర్ణం: 3,374 చ.కి.మీ.
జనాభా: 10,99,560
అక్షరాస్యత: 63 శాతం
మండలాలు: 23
అత్యధిక జనాభాగల మండలం: సూర్యాపేట
అత్యల్ప జనాభాగల మండలం: నాగారం
రెవెన్యూ డివిజన్లు: సూర్యాపేట, కోదాడ
రెవెన్యూ గ్రామాలు: 279

మంచిర్యాల


Mancherial_District విస్తీర్ణం: 3,943 చ.కి.మీ.
జనాభా: 7,07,050
అక్షరాస్యత: 61.81 శాతం
మండలాలు: 18
అత్యధిక జనాభాగల మండలం: మందమర్రి
అత్యల్ప జనాభాగల మండలం: భీమారం
రెవెన్యూ డివిజన్లు: మంచిర్యాల, బెల్లంపల్లి
రెవెన్యూ గ్రామాలు: 389

యాదాద్రి


YADADRI_District విస్తీర్ణం: 3,092 చ.కి.మీ.
జనాభా: 7,26,465
అక్షరాస్యత: 68 శాతం
మండలాలు: 16
అత్యధిక జనాభాగల మండలం: భువనగిరి
అత్యల్ప జనాభాగల మండలం: అడ్డగూడూరు
రెవెన్యూ డివిజన్లు: భువనగిరి, చౌటుప్పల్
రెవెన్యూ గ్రామాలు: 296

కుమ్రంభీం ఆసిఫాబాదు


KomaramBheem_District విస్తీర్ణం: 4,878 చ.కి.మీ.
జనాభా: 5,92,831
అక్షరాస్యత: 52.62 శాతం
మండలాలు: 15
అత్యధిక జనాభాగల మండలం: కాగజ్‌నగర్
అత్యల్ప జనాభాగల మండలం: లింగాపురం
రెవెన్యూ డివిజన్లు: ఆసిఫాబాద్, కాగజ్‌నగర్
రెవెన్యూ గ్రామాలు: 435

జయశంకర్ భూపాలపల్లి


Jaya-Shankar_District విస్తీర్ణం: 6,175 చ.కి.మీ.
జనాభా: 7,05,054
అక్షరాస్యత: 60 శాతం
మండలాలు: 20
అత్యధిక జనాభాగల మండలం: భూపాలపల్లి
అత్యల్ప జనాభాగల మండలం: కన్నాయి గూడెం
రెవెన్యూ డివిజన్లు: భూపాలపల్లి, ములుగు
రెవెన్యూ గ్రామాలు: 574

భద్రాద్రి కొత్తగూడెం


Kothagudem_District విస్తీర్ణం: 8,062 చ.కి.మీ.
జనాభా: 11,02,094
అక్షరాస్యత: 62.63 శాతం
మండలాలు: 23
అత్యధిక జనాభాగల మండలం: పాల్వంచ
అత్యల్ప జనాభాగల మండలం: ఆళపల్లి
రెవెన్యూ డివిజన్లు: భద్రాచలం, కొత్తగూడెం
రెవెన్యూ గ్రామాలు: 449

మహబూబాబాదు


MAHABUBABAD_District విస్తీర్ణం: 2,877 చ.కి.మీ.
జనాభా: 7,70,170
అక్షరాస్యత: 57 శాతం
మండలాలు: 16
అత్యధిక జనాభాగల మండలం: మహబూబాబాదు
అత్యల్ప జనాభాగల మండలం: గంగారం
రెవెన్యూ డివిజన్లు: మహబూబాబాదు, తొర్రూరు
రెవెన్యూ గ్రామాలు: 297

వరంగల్లు(రూరల్)


WARANGAL_District విస్తీర్ణం: 2,175 చ.కి.మీ.
జనాభా: 7,16,457
అక్షరాస్యత: 66 శాతం
మండలాలు: 15
అత్యధిక జనాభాగల మండలం: పరకాల
అత్యల్ప జనాభాగల మండలం: ఖానాపూరు
రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు, నర్సంపేట
రెవెన్యూ గ్రామాలు: 233

వరంగల్లు(అర్బన్)


WARANGAL_District విస్తీర్ణం: 1,305 చ.కి.మీ.
జనాభా: 11,35,707
అక్షరాస్యత: 66 శాతం
మండలాలు: 11
అత్యధిక జనాభాగల మండలం: హన్మకొండ
అత్యల్ప జనాభాగల మండలం: ఐనవోలు
రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు
రెవెన్యూ గ్రామాలు: 133

సంగారెడ్డి


SANGAREDDY_District విస్తీర్ణం: 4,441 చ.కి.మీ.
జనాభా: 15,23,758
అక్షరాస్యత: 64.26 శాతం
మండలాలు: 26
అత్యధిక జనాభాగల మండలం: జహీరాబాద్
అత్యల్ప జనాభాగల మండలం: సిర్గాపూర్.....
రెవెన్యూ డివిజన్లు: సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్
రెవెన్యూ గ్రామాలు: 600

రంగారెడ్డి


RANGAREDDY_District విస్తీర్ణం: 5,006 చ.కి.మీ.
జనాభా: 25,51,731
అక్షరాస్యత: 75.87 శాతం
మండలాలు: 27
అత్యధిక జనాభాగల మండలం: సరూర్‌నగర్
అత్యల్ప జనాభాగల మండలం: చౌదరిగూడెం
రెవెన్యూ డివిజన్లు: రాజేంద్రనగర్, చేవెళ్ల, కందుకూరు, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్
రెవెన్యూ గ్రామాలు: 594

మేడ్చల్


Malkajgiri_District విస్తీర్ణం: 1,039 చ.కి.మీ.
జనాభా: 25,42,203
అక్షరాస్యత: 69 శాతం
మండలాలు: 14
అత్యధిక జనాభాగల మండలం: కుత్బుల్లాపూర్
అత్యల్ప జనాభాగల మండలం: ఘట్‌కేసర్
రెవెన్యూ డివిజన్లు: కీసర, మల్కాజ్‌గిరి
రెవెన్యూ గ్రామాలు: 161

హైదరాబాద్


HYDERABAD_District విస్తీర్ణం: 217 చ.కి.మీ.
జనాభా: 39,43,323
అక్షరాస్యత: 83.25 శాతం
మండలాలు: 16
అత్యధిక జనాభాగల మండలం: బహదూర్‌పూర్
అత్యల్ప జనాభాగల మండలం: అమీర్‌పేట
రెవెన్యూ డివిజన్లు: హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ గ్రామాలు: 100

కరీంనగర్


Karimnagar_District విస్తీర్ణం: 2,379 చ.కి.మీ.
జనాభా: 10,18,119
అక్షరాస్యత: 61 శాతం
మండలాలు: 16
అత్యధిక జనాభాగల మండలం: కరీంనగర్
అత్యల్ప జనాభాగల మండలం: కొత్తపల్లి
రెవెన్యూ డివిజన్లు: కరీంనగర్, హుజురాబాద్
రెవెన్యూ గ్రామాలు: 215

సిరిసిల్ల రాజన్న


Sircilla_District విస్తీర్ణం: 2,019 చ.కి.మీ.
జనాభా: 5,43,694
అక్షరాస్యత: 66.1 శాతం
మండలాలు: 13
అత్యధిక జనాభాగల మండలం: సిరిసిల్ల
అత్యల్ప జనాభాగల మండలం: వీర్నపల్లి
రెవెన్యూ డివిజన్లు: సిరిసిల్ల
రెవెన్యూ గ్రామాలు: 170

పెద్దపల్లి


PEDDAPALLE_District విస్తీర్ణం: 2,236 చ.కి.మీ.
జనాభా: 7,95,332
అక్షరాస్యత: 60 శాతం
మండలాలు: 14
అత్యధిక జనాభాగల మండలం: రామగుండం
అత్యల్ప జనాభాగల మండలం: అంతర్గాం
రెవెన్యూ డివిజన్లు: పెద్దపల్లి, మంథని
రెవెన్యూ గ్రామాలు: 215

నిజామాబాదు


NIZAMABAD_District విస్తీర్ణం: 4,261 చ.కి.మీ.
జనాభా: 15,77,108
అక్షరాస్యత: 54.42 శాతం
మండలాలు: 27
అత్యధిక జనాభాగల మండలం: నిజామాబాదు (ఉత్తరం)
అత్యల్ప జనాభాగల మండలం: నిజామాబాదు (దక్షిణం)
రెవెన్యూ డివిజన్లు: నిజామాబాదు, ఆర్మూరు, బోధన్
రెవెన్యూ గ్రామాలు: 438

సిద్దిపేట


SIDDIPET_District విస్తీర్ణం: 3,432 చ.కి.మీ.
జనాభా: 10,02,671
అక్షరాస్యత: 61.45 శాతం, మండలాలు: 22
అత్యధిక జనాభాగల మండలం: సిద్దిపేట అర్బన్
అత్యల్ప జనాభాగల మండలం: కొమురవెల్లి
రెవెన్యూ డివిజన్లు: సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాదు
రెవెన్యూ గ్రామాలు: 376

వికారాబాదు


VIkarabad_district విస్తీర్ణం: 3,386 చ.కి.మీ.
జనాభా: 8,81,250
అక్షరాస్యత: 69 శాతం
మండలాలు: 18
అత్యధిక జనాభాగల మండలం: తాండూరు
అత్యల్ప జనాభాగల మండలం: బంట్వారం
రెవెన్యూ డివిజన్లు: వికారాబాదు, తాండూరు
రెవెన్యూ గ్రామాలు: 476

కామారెడ్డి


Kamareddy_District విస్తీర్ణం: 3,667 చ.కి.మీ.
జనాభా: 9,74,227
అక్షరాస్యత: 48.49 శాతం
మండలాలు: 22
అత్యధిక జనాభాగల మండలం: కామారెడ్డి
అత్యల్ప జనాభాగల మండలం: బీబీపేట
రెవెన్యూ డివిజన్లు: కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి రెవెన్యూ గ్రామాలు: 474

నాగర్‌కర్నూలు


NAGARKURNOOL_District విస్తీర్ణం: 2,966 చ.కి.మీ.
జనాభా: 8,60,613
అక్షరాస్యత: 54.04 శాతం
మండలాలు: 20
అత్యధిక జనాభాగల మండలం: నాగర్‌కర్నూలు
అత్యల్ప జనాభాగల మండలం: పదర
రెవెన్యూ డివిజన్లు: నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి రెవెన్యూ గ్రామాలు: 362

మహబూబ్‌నగరు


Mahabubnagar_District విస్తీర్ణం: 4,037 చ.కి.మీ.
జనాభా: 12,90,467
అక్షరాస్యత: 57 శాతం
మండలాలు: 26
అత్యధిక జనాభాగల మండలం: మహబూబ్‌నగరు అర్బన్
అత్యల్ప జనాభాగల మండలం: రాజాపూరు
రెవెన్యూ డివిజన్లు: మహబూబ్‌నగరు, నారాయణపేట రెవెన్యూ గ్రామాలు: 454

జోగులాంబ గద్వాల


Jogulamba_District విస్తీర్ణం: 2,928 చ.కి.మీ.
జనాభా: 6,64,971
అక్షరాస్యత: 51 శాతం
మండలాలు: 12
అత్యధిక జనాభాగల మండలం: గద్వాల
అత్యల్ప జనాభాగల మండలం: కృష్ణా
రెవెన్యూ డివిజన్లు: గద్వాల
రెవెన్యూ గ్రామాలు: 226

జనగాం


Jangaon_District విస్తీర్ణం: 2,187 చ.కి.మీ.
జనాభా: 5,82,457
అక్షరాస్యత: 61 శాతం
మండలాలు: 13
అత్యధిక జనాభాగల మండలం: జనగాం
అత్యల్ప జనాభాగల మండలం: నర్మెట
రెవెన్యూ డివిజన్లు: జనగాం, స్టేషన్‌ఘనపురం
రెవెన్యూ గ్రామాలు: 200

మెదక్


MEDAK_District విస్తీర్ణం: 2,723 చ.కి.మీ.
జనాభా: 7,67,428
అక్షరాస్యత: 55.52 శాతం
మండలాలు: 20
అత్యధిక జనాభాగల మండలం: మెదక్
అత్యల్ప జనాభాగల మండలం: రేగోడ్
రెవెన్యూ డివిజన్లు: మెదక్, తూప్రాన్, నర్సాపూరు
రెవెన్యూ గ్రామాలు: 381

ఖమ్మం


Khammam_District విస్తీర్ణం: 4,360 చ.కి.మీ.
జనాభా: 13,89,566
అక్షరాస్యత: 62.26 శాతం, మండలాలు: 21
అత్యధిక జనాభాగల మండలం: ఖమ్మం అర్బన్
అత్యల్ప జనాభాగల మండలం: ఏన్కూరు
రెవెన్యూ డివిజన్లు: ఖమ్మం, కల్లూరు
రెవెన్యూ గ్రామాలు: 380

జగిత్యాల


Jagtial_District విస్తీర్ణం: 3,043 చ.కి.మీ.
జనాభా: 9,83,414
అక్షరాస్యత: 54.53 శాతం, మండలాలు: 18
అత్యధిక జనాభాగల మండలం: జగిత్యాల
అత్యల్ప జనాభాగల మండలం: బుగ్గారం
రెవెన్యూ డివిజన్లు: జగిత్యాల, మెట్‌పల్లి
రెవెన్యూ గ్రామాలు: 284

వనపర్తి


WANAPARTHY_District విస్తీర్ణం: 3,055 చ.కి.మీ.
జనాభా: 7,70,334
అక్షరాస్యత: 54 శాతం, మండలాలు: 14
అత్యధిక జనాభాగల మండలం: వనపర్తి
అత్యల్ప జనాభాగల మండలం: ఏదుల
రెవెన్యూ డివిజన్లు: వనపర్తి
రెవెన్యూ గ్రామాలు: 279

 


పెద్దపల్లి కి మహర్దశ



Tuesday, 18 October 2016

Special Report On New Peddapalli District In Telangana

Police Cordon And Search Operation In Godavarikhani || Peddapalli

Ramagundam CP Vikram Jeet Duggal Flags Off 2K Run | Mancherial

పెద్దపల్లి జిల్లా పరిశ్రమల హబ్ ,విద్యుత్ హబ్ ,అగ్రికల్చర్ హబ్,వాటర్ హబ్ ,ఇయ్యిగాక సింగరేణి మైన్స్ ,కేశోరాం సిమెంట్ కర్మాగారం ,టూరిస్టు హబ్ గా పెద్దపల్లి జిల్లా విరాజిల్లుతుంది

పెద్దపల్లి జిల్లా పరిశ్రమల హబ్ ,విద్యుత్ హబ్ ,అగ్రికల్చర్ హబ్,వాటర్ హబ్ ,ఇయ్యిగాక సింగరేణి మైన్స్ ,కేశోరాం సిమెంట్ కర్మాగారం ,టూరిస్టు హబ్ గా పెద్దపల్లి జిల్లా విరాజిల్లుతుంది



Peddapalli district carved out of Karimnagar district is likely to emerge a power hub in Telangana with several power projects and other industries coming up in Ramagundam coal belt region.
The newly-formed Peddapalli district has Singareni coal belt, NTPC, Ramagundam Fertilizers and Chemicals Limited, Kesoram Cements and abundant natural resources, including Godavari and Manair rivers, and fertile land making the district a prosperous one on all fronts.
The Ramagundam coal belt houses 2,600-MW National Thermal Power Corporation, 62.5-MW Telangana Genco’s thermal power project, 18-MW Singareni captive power project, 15.5-MW Kesoram cements captive power project and 10-MW solar plant maintained by NTPC.
Freshly, NTPC Ramagundam has taken up Telangana super thermal power project (TSTPP) of 4,000 MW capacity in the existing power station sanctioned under the AP States Reorganisation Act. In the first phase, it would take up a project with 1,600 MW capacity at a cost of Rs. 10,600 crore and in the second phase, it would take up 2,400 MW. Prime Minister Narendra Modi recently laid the foundation stone for the execution of the power plant.
From the existing NTPC Ramagundam, Telangana was receiving its share of 29 per cent power. With the 4,000-MW TSTPP, the State would receive 75 per cent of power generated from the power station.
Similarly, the closed Fertilizer Corporation of India (FCI) is being revived as Ramagundam Fertilizers and Chemicals Limited (RFCL) at Ramagundam at a cost of Rs. 5,200 crore. The RFCL would tentatively begin production from 2019.
Agricultural scenario
With the completion of Sripada Yellampalli Project and SRSP command area, the agricultural scenario would be completely changed in the new Peddapalli district. At present, the area of cultivation of paddy in the district is 65,705 hectares and cotton is 38,398 hectares. With the irrigation projects being full, the area of cultivation is likely to go up further in the district.
Members of Telangana Boggu Ghani Karmika Sangham (TGBKS), a trade union affiliated to TRS, said that Peddapalli district would emerge a power hub of Telangana with new coal projects coming up here

Monday, 17 October 2016

సింగరేణి లో ఆగని మరణాలు


సింగరేణి లో ఆగని మరణాలు

కల్లు దుకాణాల పై దాడులు


Ramagundam Commissioner Vikramjeet Duggal Face To Face | Peddapalli

Sunday, 16 October 2016

Ramagiri Killa in peddapalli District -

Special Report on Sripada Yellampalli Project | Godavari Water

Gouri Gundala Waterfalls at Sabbitham Village in Peddapalli district

Sri Rama Gundalu Significance At Ramagundam In Peddapalli district

Etela Rajender Inaugurates Peddapalli District

Saturday, 15 October 2016

తెలంగాణ రాష్ట్రం లో హైదరాబాద్ తరువాత అత్యంత దానికా జిల్లా పెద్దపల్లి జిల్లా నే

రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం లో హైదరాబాద్ తరువాత అత్యంత దానికా జిల్లా పెద్దపల్లి జిల్లా నే

new telangana map

నూతనా తెలంగాణా రాష్ట్ర ముఖ చిత్రం

జిల్లా కార్యాలయాలు

జిల్లా కార్యాలయాలు

జిల్లా అధికారుల ఫోన్ నంబర్లు

Friday, 14 October 2016

Manthani revenue mandals

1.manthani
2.kamanpur
3.ramagiri
4.mutharam

Peddpalli revenue

1.ramagundam
2.peddapalli
3.odela
4.sulthanabad
5.julapalli
6.eligaid
7.dharmaram
8.anthergaon
9.palakurthy
10.srirampur