బొగ్గు గని కార్మికుల ఆకాంక్షకు అనుగుణంగా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయించ డం జరిగిందనీ, ఆ మేరకు అధికారులకు
సూచించినట్లు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు
పేర్కొన్నారు. యూనియన్ కార్యాలయంలో శనివారం ప్రధాన కార్యదర్శి కెంగర్ల
మల్లయ్య కేంద్ర ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి విలేకరులతో
సమావేశమై, ఆయన మాట్లాడారు.
ఈ నెల 6న సంఘ గౌరవ అధ్యక్షురాలు ఎంపీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ముఖ్యమంత్రిని కలిసి కార్మికుల ఆకాంక్షను ఆయన దృష్టికి తీసుకెళ్లామనీ, వెంటనే ఆయన స్పందించి దసరా కానుకగా ఎలాంటి షరతులు లేకుండా అందరికీ వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే వారసత్వ ఉద్యోగాలపై 20న ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ నుంచి సింగరేణి కార్యాలయానికి లేఖ వచ్చినట్లు చెప్పారు. దీనిపై త్వరలోనే జరుగనున్న బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారనీ, మెజార్టీ సభ్యుల అనుమతి లభించిన పదిరోజుల్లో వారసత్వ ఉద్యోగాల అమలుపై సింగరేణి స్పష్టమైన నిర్ణయం ప్రకటించనున్నదని పేర్కొన్నారు.
ఇది జీర్ణించుకోలేని జాతీయ సంఘాలు వారసత్వంపై చేస్తున్న విషప్రచారాన్ని కార్మికులు నమ్మొద్దని పిలుపునిచ్చారు. గతంలో వారసత్వ ఉద్యోగాల కాలపరిమితి ఒక సంవత్సరం వుంటే దాన్ని రెండేళ్లకు పెట్టి అమ్ముకున్న ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్ సంఘాలు ఇప్పుడు రాద్దాంతం చేయడం సిగ్గు చేటన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సింగరేణి కార్మికులకు సొంతింటి కల నేరవేర్చుతామని హామీ ఇచ్చారు. ఇందులో ఐలి శ్రీనివాస్, కొత్తసత్యనారాయణరెడ్డి, శంకర్‌నాయక్, నాగెల్లి సాంబయ్య, కె.రవీందర్, శ్రీనివాస్‌రెడ్డి, సుంకరి విజయ్, కాంతాల కిషన్‌రెడ్డి, పర్రెరాజనరేందర్, ఇసంపెల్లి రమేష్, ఇటికాల బాలయ్య, పెంచాలతిరుపతి, నాయిని మల్లేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

0 comments:
Post a Comment